Site icon PRASHNA AYUDHAM

నేడు కాంగ్రెస్ పార్టీ నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయండి

IMG 20250703 WA0070

*నేడు కాంగ్రెస్ పార్టీ నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయండి*

*శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన చైర్మన్ మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇంగిలే రామారావు*

*జమ్మికుంట /ఇల్లందకుంట జూలై 3 ప్రశ్న ఆయుధం*

నేడు నిర్వహించే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను విజయవంతం చేయండి అని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్ మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇంగిలే రామారావు అన్నారు జులై 4న శుక్రవారం సాయంత్రం 4:00 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే హాజరై కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడనున్నారని కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్ కాంగ్రెస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు ఇంగిలే రామారావు పేర్కొన్నారు మండలంలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఈ కార్యక్రమానికి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్ని శాఖల మంత్రులు హాజరవుతారని 18 గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్షులు రావాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో గ్రామ శాఖ అధ్యక్షులను కలవడం సువర్ణ అవకాశం అని కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఇప్పటినుండే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుందని రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే కష్టపడి పని చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తలు గోడిషాల పరమేష్, చిరంజీవి, గోపాల్ రెడ్డి ,శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version