హైదరాబాదులో చేపట్టిన ఎస్సీ కులాల నిరసన దీక్షను విజయవంతం చేయండి

హైదరాబాదులో చేపట్టిన ఎస్సీ కులాల నిరసన దీక్షను విజయవంతం చేయండి

ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 10 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి

షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి(ఎస్ సి హెచ్ పి ఎస్)ఐక్య సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాదులో ఈనెల 12,13,14 తేదీలలో చేపట్టిన ఎస్సీ కులాల నిరసన దీక్షను విజయవంతం చేయాలని షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ ఆదివారం వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల అభివృద్ధిపై ఆంక్షలు ఎత్తివేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏజెన్సీ ప్రాంతం పేరుతో ఎస్సీ కులాల తొలగించిన స్థానిక రిజర్వేషన్ తిరిగి అమలు చెయ్యాలని.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎస్సీ కులాల జనాభా పెరిగినందున ఎస్సీ కులాల రిజర్వేషన్ 20 శాతం పెంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.అభివృద్ధిలో దగాపడ్డ దళితులు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన దీక్షను విజయవంతం చేసి హక్కుని సాధించుకునే విధంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

అదేవిధంగా ప్రజాప్రతినిధులు,

వివిధ పార్టీల,ప్రజా సంఘాల,

కులసంఘాలపెద్దలు,అంబేద్కర్

ఆలోచనపరులు,విద్యావంతులు మేధావులు,కళాకారులు,యువకులు,మహిళలు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment