పోలింగ్ బూత్ అధ్యక్షుల సమ్మేళనానికి విజయవంతం చేయండి
మొదటిసారిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు జిల్లాకు రాక
జమ్మికుంట ఇల్లందకుంట సెప్టెంబర్ 1 ప్రశ్న ఆయుధం
ఈనెల 3వ తేదీన జరగనున్న పోలింగ్ బూత్ అధ్యక్షుల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఇల్లందకుంట బిజెపి మండల అధ్యక్షునితో కలిసి మండల ఇంచార్జ్ ఆకుల రాజేందర్ కోరారు ఈ సమ్మేళనానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మొదటిసారిగా కరీంనగర్ జిల్లాకు రావడం జరుగుతుందని తన పర్యటన విజయవంతం చేయాలని మండల అధ్యక్షుడు రమణారెడ్డి బిజెపి శ్రేణులను కోరారు ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షునితో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని బూత్ అధ్యక్షులకు బిజెపి శ్రేణులకు స్థానిక సంస్థల ఎన్నికలపై దిశా నిర్దేశం చేయనున్నారు కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా బూత్ అధ్యక్షులు బూత్ కార్యదర్శిలు బూతు సోషల్ మీడియా ఇన్ఛార్జి లతో సమావేశం విజయవంతం చేయడానికి ఇల్లందకుంట బిజెపి మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి ఆధ్వర్యంలో శక్తి కేంద్ర ఇంచార్జి లతో సమావేశమై బిజెపి శ్రేణులకు సమావేశ విజయవంతమునకు సమాయతం చేశారు మండల ఇన్చార్జి ఆకుల రాజేందర్ మాట్లాడుతూబీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు రాంచందర్ రావు పర్యటన విజయవంతం చెయ్యాలని అదేవిధంగా సమావేశానికి వచ్చే వారిని కలిసి 100% సమావేశానికి హాజరయ్యే విధంగా బిజెపి ముఖ్య నాయకులు ప్రయత్నం చేయాలని మార్గ నిర్దేశం చేశారు ఈ కార్యక్రమం లో అబ్బిడి తిరుపతి రెడ్డి, రావుల విజయ్ బాబు, తాళ్ల పాపిరెడ్డి, ఉప్పు దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు