Site icon PRASHNA AYUDHAM

విద్యార్థులకు లక్ష్య స్పష్టత ఉంటే విజయమే – కలెక్టర్ మను చౌధరి

IMG 20250723 WA0051 1

*విద్యార్థులకు లక్ష్య స్పష్టత ఉంటే విజయమే – కలెక్టర్ మను చౌధరి*

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూలై 23

విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో కృషి చేస్తే విజయం సాధించలేనిది ఏమీ లేదని మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌధరి అన్నారు. బుధవారం ఆయన అదనపు కలెక్టర్ రాధికా గుప్తాతో కలిసి మల్కాజ్‌గిరి మండలంలోని ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలను సందర్శించారు.

కలెక్టరేట్ బృందం ఈ సందర్బంగా కళాశాలల మౌలిక వసతులు, తరగతి గదులు, వాష్‌రూములు, ఫర్నీచర్, కంప్యూటర్లు, ల్యాబ్‌ల వంటి అంశాలను సమీక్షించింది. అవసరమైన మౌలిక సదుపాయాల కోసం అంచనాల నివేదికను సిద్ధం చేసి తక్షణమే పంపించాలని కళాశాల ప్రిన్సిపాల్‌కు కలెక్టర్ సూచించారు.తర్వాత విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రీడా మైదానం, క్యాంటీన్, రవాణా సదుపాయాల కొరతను ప్రస్తావించగా, వీటిని త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.ఈ సందర్శన విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.

Exit mobile version