మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి

*మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి*

*IMG 20250222 WA0088

హక్కుల దండోరా పోస్టర్ ఆవిష్కరణ.*

*మాదిగ హక్కుల దండోరా జిల్లా అధ్యక్షుడు రేణిగుంట్ల కుమార్*

*జమ్మికుంట ఫిబ్రవరి 22 ప్రశ్న ఆయుధం*

ఈనెల 27, 28న నాగార్జునసాగర్ లో నిర్వహించే మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఎమ్ హెచ్ డి జిల్లా అధ్యక్షుడు రేణిగుంట్ల కుమార్ మాదిగ, హుజరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ దొడ్డే రాజేంద్రప్రసాద్ మాదిగ పిలుపునిచ్చారు వారు పాత మార్కెట్ ఆవరణలో పోస్టర్ ఆవిష్కరణ చేసి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు రావాల్సిన న్యాయబద్ధమైన వాటా సాధించడానికి దశాబ్దాల సమస్య అయినా వర్గీకరణ అంశాన్ని పరిష్కరించుకోవడానికి మాదిగ జాతిని సంఘటితం చేసి పోరాటాలు చేయడమే సరైన మార్గమని భావించి 30 ఏళ్ల క్రితమే మాదిగ జాతి అస్తిత్వం హక్కుల కోసం దండోరా ఉద్యమాలు చురకైన నాయకత్వం పోషించడం జరిగింది. తద అనంతరం అంశాలపరమైన భేదాభిప్రాయాల కారణంగా నూతన జెండా అజెండాలతో నిర్మాణాత్మక లక్ష్యాలతో 2021 సంవత్సరంలో ఫిబ్రవరి 27న మాదిగ హక్కుల దండోరా సంఘాన్ని స్థాపించుకోవడం జరిగిందని మాదిగ హక్కుల దండోరా సంఘం ఆవిర్భావం నుండి మాదిగ జాతి పక్షాన నిరంతరం పోరాడుతూ జాతికి రావాల్సిన హక్కుల కోసం పాలకులను ప్రశ్నిస్తూనే ఉద్యమిస్తూ ఉన్నాం అని అన్నారు. వెనుకబాటుతనం జనాభా దామాషా ప్రకారం మాదిగలకు 11% రిజర్వేషన్ కల్పించాలి, హైదరాబాదులో మాదిగ అమరవీరుల స్మారక భవనానికి స్థలం కేటాయించి భవన నిర్మాణం చేపట్టాలి, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో కేటాయించిన అసైన్డ్, భూదాన్ భూములకు శాశ్వత పట్టాలు మంజూరు చేయాలి, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి దళితుల్లో ఎక్కువ శాతం జనాభా ఉన్న మాదిగలకు జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలి అని పలు డిమాండ్లు లేవనెత్తారు. వీరికి జమ్మికుంట మినీ లెదర్ పార్క్ సాధన చర్మకార ఉత్పత్తి కారుల సంక్షేమ సంఘం వారు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ అధ్యక్షులు దొడ్డే శ్రీకాంత్, దొడ్డే రాజు, అంజి స్వామి దాసు, మోతే స్వామి, ఇమ్మడి రాజు, కొమురయ్య, శ్రీనివాస్ లింగయ్య పి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now