Site icon PRASHNA AYUDHAM

విద్యారంగా సమస్యలు పరిష్కరించాలని పాఠశాలల, జూనియర్ కళాశాలల బంద్ విజయవంతం

IMG 20250723 WA0045

విద్యారంగా సమస్యలు పరిష్కరించాలని పాఠశాలల, జూనియర్ కళాశాలల బంద్ విజయవంతం

– ఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు, ఏఐఎస్ఎఫ్, ఏఐఎఫ్డిఎస్

– కామారెడ్డి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన పాఠశాలల, జూనియర్ కళాశాలల బంద్ విజయవంతం అయింది. జిల్లా కేంద్రంలో పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయ్ ఈ సందర్బంగా ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి ముదాం అరుణ్ పి.డి.ఎస్.యు రాష్ట్ర సహాయ కార్యదర్శి జి సురేష్, ఏఐఎండీఎస్ రాష్ట్ర నాయకులు జబ్బార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ శివ ప్రసాద్, పిడిఎస్యు పట్టణ అధ్యక్షులు ప్రవీణ్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18,19 నెలలు గడుస్తున్న ప్రభుత్వ విద్యాసంస్థలను గాలికి వదిలేయడం సరైనది కాదన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు చదువుతున్న విద్యాసంస్థలకు గత కొన్ని సంవత్సరాల తరబడి రావలసిన స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ 8000 వేల కోట్ల బకాయిలో పెండింగ్లో ఉండడంతో విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి అనేక రకాలైయిన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. కాలేజీ యజమాన్యాలు ఫీజులు కడితేనే సర్టిఫికెట్స్ ఇస్తామని వేధిస్తున్నారన్నారు.

గత ప్రభుత్వం మన ఊరి మనబడి అనే కార్యక్రమం పెట్టి ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉన్న మూత్రశాలలను, మరుగుదొడ్లను, వంటశాలలను, పాత బిల్డింగ్లను కూల్చివేసి కొత్తవి కడతామని చెప్పి వదిలేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ ఆదర్శ కమిటీలు వేసి కనీసం విద్యార్థులకు అందించవలసిన మూత్రశాలలు, మరుగుదొడ్లనైన నిర్మించకపోవడం వల్ల విద్యార్థులు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.అమ్మాయిలు, అబ్బాయిలు బయటికి వెళ్లడం వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే భవనాలోనే మరుగుదొడ్లు, మూత్రశాలలో వంట గదులను వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కార్పోరేట్, ప్రయివేట్ విద్యాసంస్థలలో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలు చట్టాల ప్రకారం ఈ ఒక్క ప్రైవేటు ,కార్పోరేట్ విద్యా సంస్థలను నడవడం లేదు ఎవరికి వారే ఇష్టానుసారంగా ఫీజుల దందాను చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఫీజుల నియంత్రణ చట్టాన్ని ప్రైవేటు కార్పొరేట్ విద్య సంస్థలో పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మణికంఠ, రాహుల్, ఫయాజ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version