**ఈస్ట్ గాంధీనగర్ ఫేజ్-2లో ఉచిత వైద్య శిబిరం విజయవంతం – వందలాది మంది లబ్దిదారులు**
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం జులై 6
ఈస్ట్ గాంధీనగర్ ఫేజ్-2లో ఎస్ క్యూర్ (నాగారం) హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. డాక్టర్ సప్న, డాక్టర్ శ్వేత, డాక్టర్ రామారావు పర్యవేక్షణలో జరిగిన ఈ శిబిరంలో వందలాది మంది ప్రజలు వైద్య సేవలు పొందారు.ఈ శిబిరంలో రోగ నిర్ధారణ, సాధారణ చికిత్సలు, బీపీ, షుగర్, హార్ట్ చెకప్ వంటి సేవలతో పాటు ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించబడింది.ఈ కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్ మాదిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆదం షఫీ, కాలనీ కమిటీ సభ్యులు కె. రామచంద్ర రెడ్డి, సాయి యాదవ్, ఆనందశర్మ, లక్ష్మీనారాయణ, రమేష్ బాబు, జైబాలు, పిచ్చిరెడ్డి తదితరులు హాజరయ్యారు. వారు ఆరోగ్యంపై ప్రజలకు మేలు చేసే సూచనలు ఇచ్చి, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు.
హాస్పిటల్ నిర్వాహకులు మాట్లాడుతూ –
> “సమాజానికి మేము అందించే వైద్య సేవలే మా బాధ్యతగా భావిస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా విస్తృత స్థాయిలో శిబిరాలు నిర్వహించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.ప్రజలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్యంపై మేలైన అలవాట్లు అలవరచుకోవాలని నిర్వాహకులు సూచించారు.