విజయవంతంగా ముగిసిన సఖీ జాతీయ మహిళా మండలి వనభోజనాలు

*ఖమ్మం చెరుకూరి తోటలో విజయవంతంగా ముగిసిన సఖీ జాతీయ మహిళా మండలి వనభోజనాలు*

నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ*

ఖమ్మం చెరుకూరి తోటలో వనభోజనాలు విజయవంతంగా ముగిసినాయి . మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు . ఖమ్మం సఖి జాతీయ మహిళా మండలి సోదరీమణులు ఆనందంగా ఉత్సాహంగా పాల్గొనడం సంతోషదాయకం అనిపించింది . కులాలకు అతీతంగా , మతాలకు అతీతంగా , ప్రాంతాలకు అతీతంగా సఖి జాతీయ మహిళా మండలి వనభోజనాలు నిర్వహించడం చాలా సంతోషదాయకమని ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ తెలియజేశారు . తెలుగువారి ఆచార సంప్రదాయాలకు ప్రతీక వనభోజనాలు . ప్రతి సోదరీమణి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది . సఖి జాతీయ మహిళా మండలి సోదరీమణులు ఆటపాటలతో అలరించడం జరిగింది . సఖీ జాతీయ మహిళా మండలి సోదరీమణులు మన సంస్కృతిని సాంప్రదాయాలను కట్టుబాట్లను తెలియజేశారు . వనభోజనాలు అంటే వనములో అందరము కలిసి చిన్న పెద్ద తేడా లేకుండా కుల మత తేడాలు లేకుండా అందరం కలిసికట్టుగా సంతోషదాయకంగా కలిసి భోజనం చేయడము . ఖమ్మం సఖిజాతీయ మహిళా మండలి సోదరీమణులు పెద్ద మొత్తంలో పాల్గొని సఖీ జాతీయ మహిళా మండలి వనభోజనాలను విజయవంతం చేసినందుకు పేరుపేరునా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు .

Join WhatsApp

Join Now

Leave a Comment