కేసిఆర్ కు సుదర్శన చక్ర శిఖర ప్రతిష్ట ఆహ్వాన పత్రిక అందజేత

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్, హరీష్ రావులకు సుదర్శన చక్ర శిఖర ప్రతిష్ట ఆహ్వాన పత్రిక అందజేత

-తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్,ఆలయ వ్యవస్థాపకులు యస్.హనుమంతరావు,డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి

సిద్దిపేట జిల్లా , 01 మార్చి 2025 : సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయంలో ఈనెల 7,8,9,10వ తేదీలలో జరిగే వార్షికోత్సవం సందర్బంగా 9వ తేదీన సుదర్శనచక్ర శిఖర ప్రతిష్ట కార్యక్రమం ఆహ్వాన పత్రిక ను తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కు,మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు శనివారం రోజు ఎర్రవల్లి లోని కేసిఆర్ వ్యవసాయ క్షేత్రంలో అందజేసిన తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్,ఆలయ వ్యవస్థాపకులు యస్.హనుమంతరావు వారితోపాటు డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, బేతి నరేందర్ రెడ్డి,తాండ శ్రీనివాస్ గౌడ్, ఉప్పరి నర్సింగరావు,ఆంజనేయులు,మ్యాకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now