భక్తుల ఆధ్వర్యంలో సుదర్శన హోమం 

నాలుగు జిల్లాల నుండి వచ్చిన భక్తుల ఆధ్వర్యంలో సుదర్శన హోమం

లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో నాలుగు జిల్లా నుండి వచ్చిన భక్తుల ఆధ్వర్యంలో సుదర్శన హోమాన్ని నిర్వహించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అటవీ ప్రాంతంలో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చుక్కాపూర్ లో స్వాతి నక్షత్రం సందర్భంగా శుక్రవారం సుదర్శన హోమ కార్యక్రమన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, మెదక్ జిల్లాలలో నుండి వచ్చిన భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని ఆలయ ఈవో శ్రీధర్ రావు తెలిపారు. హోమ అనంతరం వారికి తీర్థప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment