నిజాంపూర్ (కె)పాఠశాలను సందర్శించిన నోడల్ అధికారి సుధాకర్

IMG 20250108 181720
సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 8 (ప్రశ్న ఆయుధం న్యూస్): సదాశివపేట మండల పరిధిలోని నిజాంపూర్ (కె) ప్రాథమిక పాఠశాలను నోడల్ అధికారి సుధాకర్ బుధవారం సందర్శించారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ సహాయంతో తెలుగు, ఇంగ్లీష్, గణితానికి సంబంధించి పాఠ్యాంశాలలో చేసే బోధనను పరిశీలించారు. పాఠశాల రికార్డులతో పాటు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాల ఆవరణలో కొబ్బరి మొక్కను నాటి నీరు పోశారు. అనంతరం నోడల్ అధికారి సుధాకర్ మాట్లాడుతూ.. పాఠశాలలో తయారు చేసిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తో ఉపాద్యాయుల భోధన చాలా బాగుందని అన్నారు. పాఠశాల వాతావరణం, పాఠశాలకు సంబంధించి అన్ని రంగాలలో బాగుందని మెచ్చుకున్నారు. ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ, ఉపాధ్యాయులు నవనీత, సునీతలు పాఠశాల అభివృద్ధికి బాగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఎస్.సి.ఈ.ఆర్.టి తెలంగాణ బెస్ట్ ప్రాక్టీస్ విభాగంలో ఎంపికైనందున రామకృష్ణకు అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సునీత, నవనీత, సీఆర్ పీ నగేష్, విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now