జనగామ జిల్లా వాసి అమెరికాలో సూసైడ్
అమెరికాలోని ఓక్లహోమా రాష్ట్రం ఎడ్జుండ్లో నివసిస్తున్న తెలంగాణ జనగామ జిల్లా నెల్లుట్లకు చెందిన కుర్రెముల సాయికుమార్ (31) లైంగిక వేధింపుల కేసులో 35 ఏళ్ల జైలు శిక్ష ఎదుర్కొన్నాడు. 2023లో ఎఫ్బఐ సాయికుమార్ సోషల్ మీడియా ఖాతాలపై విచారణ జరిపి 13-15 ఏళ్ల బాలుడిగా నటిస్తూ మైనర్లను మోసగించినట్టు నిర్ధారించింది. అసభ్య చిత్రాలు పంపించడం, బెదిరింపులు వంటి కేసుల్లో అతడు 19 మంది మైనర్లను వేధించినట్టు కోర్టు తేల్చింది. శిక్ష అనంతరం జూలై 26న జైలులో సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కుటుంబసభ్యులు జూలై 31న అమెరికాకు వెళ్లారు.