Site icon PRASHNA AYUDHAM

ఆత్మహత్యలే శరణ్యం….

ఆత్మహత్యలే శరణ్యం అంటున్నా ప్రజలు….

మా ఇళ్ళ జోలికొస్తే ఆత్మహత్యలే శరణ్యం అంటున్న గ్రామ ప్రజలు…

గ్రామానికి చెందిన రిటైర్మెంట్ వీఆర్వో భూ కబ్జా వెనుక అధికారుల హస్తం..

మహాప్రసన్నాలు పుచ్చుకొని సామాన్య ప్రజలతో చెలగాటమాడుతున్న అధికారులు

నా వెనకాల మంత్రి ఉన్నారు ఏం చేస్తారో చెయ్ అంటూ బెదిరింపులకు దిగుతున్న రిటైర్మెంట్ విఆర్ఓ

ప్రశ్న ఆయుధం 22జులై హైదరాబాద్ :
మనోహరాబాద్, మండలంలోని కొండాపూర్ గ్రామానికి ఆనుకొని ఉన్న సర్వేనెంబర్ 144 లో గల భూమిలో 18 సంవత్సరాలుగా నివసిస్తున్న వారి కుటుంబాలను. కొండాపూర్ గ్రామానికి చెందిన రిటైర్మెంట్ విఆర్ఓ ఈ భూమి నాది అంటూ నివాసముంటున్న కుటుంబాలకు బెదిరిస్తున్నారు.కోర్టు నోటీసులతో అమాయక ప్రజలను భయభ్రాంతులకుగురిచేస్తున్నాడు.జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలనిగ్రామప్రజలుప్రశ్నిస్తున్నారు.నా వెనకాల మంత్రి ఉన్నారు భూమిలో నుంచి ఖాళీ చేయకపోతే కోర్టుకు ఇడుస్తానంటూ బెదిరింపులకు దిగుతున్న పట్టించుకునే అధికారులే కరువాయారాని భూమిలో నివాస ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో వీఆర్వో గా పనిచేసి బినామీల పేరుతో అక్రమాస్తులు సంపాదన కోసం ఏకంగా గ్రామానికి చెందిన జాగిర్ధర్ భూమిపై కన్ను వేసి గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూబెదిరింపులకుదిగుతున్నాడు.పలుమార్లురెవెన్యూఅధికారులకు ఫిర్యాదు చేసిన మాకు మంత్రి నుంచి ఫోన్లు వస్తున్నాయని అధికారులు కూడా ప్రజలను భయపట్టిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల గుడిసెలు తీసివేసి కబ్జా చేయమని చెప్పిందా అని పలువురు అధికారులను ప్రశ్నిస్తున్నారు. గ్రామానికి చెందిన రిటైర్మెంట్ వీఆర్వో కు రైతుల భూములు మొదలు కొంటే సామాన్య ప్రజల కుటుంబాల తో చెలగాటలాడుతున్న ప్రభుత్వం పట్టించుకోదని ప్రజలు బిక్కుబెక్కుమంటున్నారు.ఇలా అయితే గ్రామ ప్రజలకు ఆత్మహత్యల శరణ్యమని సోమవారం, మీడియాతో గోడు విల్లపించుకున్నారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి భూ కబ్జా చేస్తున్న రిటైర్మెంట్ విఆర్వో పై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు సామాన్య ప్రజలకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలని 2016 నుంచి 2021 వరకు లావణ్ణి పట్టాగా ఉన్న భూమి 2022లో ఎలా పట్టాగా మారిందో అధికారులు రికార్డులు పరిశీలించాలని 18 సంవత్సరాలుగా భూమిలో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Exit mobile version