Site icon PRASHNA AYUDHAM

కన్నీరు పెట్టిస్తున్న సూసైడ్ లేఖ

IMG 20250804 WA1219

కన్నీరు పెట్టిస్తున్న సూసైడ్ లేఖ

 

అరేయ్ తమ్ముడు జాగ్రత్త.. ఈ సారి నేను నీకు రాఖీ కట్టలేనేమో

 

పెళ్ళైన ఆరు నెలలకే భర్త వేధింపులు భరించలేక నవవధువు ఆత్మహత్య

 

కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కలవపాముల గ్రామంలో విలేజ్ సర్వేయర్‌గా పని చేస్తున్న రాంబాబుకు, ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్న శ్రీవిద్య(24)ను ఇచ్చి 6 నెలల క్రితం పెళ్లి చేసిన పెద్దలు

 

పెళ్ళైన నెల రోజుల నుంచే తాగొచ్చి శ్రీవిద్యను దారుణంగా కొట్టి హింసించిన రాంబాబు

 

ఓ అమ్మాయి ముందు‌ నేను పనికిరానని రాంబాబు హేళనగా మాట్లాడాడని.. నా తలను మంచానికి వేసి‌ కొట్టి, వీపుపై పిడిగుద్దులు గుద్ది హింసించాడని సూసైడ్ లేఖలో రాసిన శ్రీవిద్య

 

ఈ స్థితికి కారణమైన రాంబాబును, అతని కుటుంబసభ్యులను ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు అంటూ సూసైడ్ లేఖ రాసి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న శ్రీవిద్య

Exit mobile version