*ప్రేమ విఫలమై తీవ్రమణస్థాపంతో వ్యక్తి రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య*
*జమ్మికుంట మే 7 ప్రశ్న ఆయుధం*
జిల్లా జమ్మికుంట రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం రోజున ప్రేమ విఫలమై తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు రైల్వే ట్రాక్ పై పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే ఇల్లంతకుంట మండల కేంద్రంలోని లక్ష్మణ పల్లె కు చెందిన ధార ఎల్లేష్ ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో ఒక యువతి తో పరిచయం ఏర్పడి క్రమేపి ప్రేమగా మారింది అయితే ఆ యువతి వేరే వ్యక్తిని వివాహం చేసుకోవడంతో మానసికంగా కృంగిపోయి తీవ్ర మనోవేదనకు లోనై ఎల్లేష్ బుధవారం రోజున జమ్మికుంట రైల్వే స్టేషన్ కు కూత వేటు దూరంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు మృతుని తల్లి రాజేశ్వరి తెలిపిన వివరాల ప్రకారం తన కుమారుడు ప్రేమ విషయంలో తీవ్రంగా బాధ పడ్డాడని ఆ కారణంగానే ఈ దారుణానికి పాల్పడ్డాన్ని వెల్లడించారు ఈ ఘటనపై రామగుండం రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జి తిరుపతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు