*దిగజారుడు మాటలు మానుకో కౌశిక్ రెడ్డి* –
*జోకర్ మాటలు బ్రోకర్ పనులకు బ్రాండ్ అంబాసిడర్ గా కౌశిక్ రెడ్డి*
*హుజరాబాద్ నియోజకవర్గం ప్రతిష్టను దిగజారుస్తున్న కౌశిక్ రెడ్డి*
*యువజన కాంగ్రెస్ నాయకులు టేకుల శ్రావణ్*
*జమ్మికుంట హుజురాబాద్ ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 17*
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే “సూసైడ్ స్టార్” పాడి కౌశిక్ రెడ్డి దిగజారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని యువజన కాంగ్రెస్ నాయకులు టేకుల శ్రావణ్ అన్నారు ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ హుజురాబాద్ ఎమ్మెల్యే సూసైడ్ స్టార్ పాడి కౌశిక్ రెడ్డి అతని స్థాయి మరిచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని అసలు రాష్ట్ర వ్యాప్తంగా కౌశిక్ రెడ్డివి జోకర్ మాటలు బ్రోకర్ పనులు అని మాట్లాడుకుంటున్నారని కాంగ్రెస్ లో ఉండి బి ఆర్ ఎస్ పార్టీ కోవర్టు గా మారి పార్టీలో అంతర్గత విషయాలు కేసీఆర్,కేటీఆర్ కి చేరవేస్తూ రాజకీయ పబ్బం గడిపి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు? ఉద్యోగాలు ఇప్పిస్తామని నియోజకవర్గంలో కొంతమంది అమాయకుల దగ్గర డబ్బులు వసూలు చేసిన చరిత్ర నీది నువ్వా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురుంచి మాట్లాడేది రేవంత్ రెడ్డి కి పీసీసీ ఇప్పించే స్థాయా నీది 2018 రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కితే నీకు టికెట్ వచ్చింది నిజం కాదా అని అన్నారు.మీరు ఎమ్మెల్సీ గా ఉన్న సమయంలో ఎన్ని అక్రమాలు చేశారో నియోజకవర్గ ప్రజలకు తెలుసని,అధికారాన్ని అడ్డుపెట్టుకుని చాలా మంది వ్యాపారస్తులను బెదిరించింది నిజం కాదా అని అన్నారు.సోషల్ మీడియాలో హైలెట్ కావడం కోసం ఈ విధంగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు మీకు అంతగా కేసీఆర్,కేటీఆర్ దగ్గర మెప్పు పొందాలంటే వారి దగ్గర ఊడిగం చేసుకో కానీ కాంగ్రెస్ పార్టీ గురుంచి,ముఖ్యమంత్రి గురుంచి మాట్లాడితే అదే తరహాలో సమాధానం చెప్తాం అని హెచ్చరించారు.