కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి …సుజాత సూర్యవంశి 

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి

– వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి

ఆయుధం – కామారెడ్డి

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈనెల 19న హెదరాబాద్ లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ రాష్ట్రా విస్తృత స్థాయి సమావేశాన్ని ప్రతి మండలం నుండి వికలాంగులు పాల్గొని విజయవంతం చేయాలని జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమే మాట్లాడుతూ వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషిచేసి జిల్లావ్యాప్తంగా ఉన్న వికలాంగులు ఈ కార్యక్రమానికి వచ్చే విధంగా కృషిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి వికలాంగునికి 6000 రూపాయల పింఛన్ ఇవ్వాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలోనే రాష్ట్ర ప్రభుత్వంతో తాడోపేడో తెలుసుకునే నిర్ణయం జరుగుతుందని కావున ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లాలోని మండల, గ్రామాల నుండి అధిక సంఖ్యలో వికలాంగులు తరలిరావాలన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి ప్రతి నియోజకవర్గ బాధ్యులు ప్రతి నియోజకవర్గము నుండి అత్యధికంగా వికలాంగులను తీసుకురావాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కోల బాల్ రాజ్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు నహమొద్దిన్, అమీద్ బాయి, నారెడ్డి రాజిరెడ్డి, చిన్నకాంతం తదితరులు పాల్గోన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment