సూళ్లూరుపేట నారాయణ స్కూల్ బస్సు బోల్తా

తిరుపతి జిల్లా..

సూళ్లూరుపేట నారాయణ స్కూల్ బస్సు బోల్తా 

తడ మండలం బోడి లింగాలపాడు జాతీయ రహదారిపై విద్యార్థులను తీసుకువెళుతున్న సూళ్లూరుపేట నారాయణ స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. 

బస్సులో 30 మంది విద్యార్థులుండగా, పలువురికి గాయాలు అయ్యాయి.

డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

గాయపడిన విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

అయితే ప్రాణాపాయం లేకపోవడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు.

Join WhatsApp

Join Now