తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుమ దంపతులు!

*తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుమ దంపతులు!*

తిరుపతి జిల్లా:జూన్ 07

తిరుమల తిరుపతి వెంక టేశ్వర స్వామిని యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల దంపతులు తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం దర్శించుకు న్నారు.

వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల దంపతులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు.

దర్శన అనంతరం రంగనా యకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్ర సాదాలను అందజేశారు. అదే విధంగా లోకసభ ఎంపీ బి.కె పార్థసారథి సైతం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

*శ్రీవారి మెట్లభక్తులకు తిరుపతిలో టోకెన్లు*

మరోవైపుశ్రీవారి మెట్ల మార్గం నుంచి తిరుమలకు వెళ్లే భక్తులకు తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌ లో ఎస్‌ఎస్‌డీ టోకెన్ల పంపిణీ ప్రక్రియను టీటీడీ శుక్రవారం సాయంత్రం నుంచి ప్రారంభించింది. ఇందుకు అధికారులు 10 కౌంటర్లతో పాటు అదనంగా మరో 4 కౌంటర్లను ఏర్పాటు చేశారు.

Join WhatsApp

Join Now