*సన్ రైజర్స్ హైదరాబాద్ కు అగ్ని పరీక్షే ?*
*హైదరాబాద్:మే 02*
ఐపిఎల్ 2025-18వ సీజన్ లో భాగంగా నేడు జరిగే కీలక మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడ నుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరగనుంది ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ మూడిం టిలో మాత్రమే విజయం సాధించింది.
గుజరాత్ ఆరు విజయాల తో మెరుగైన స్థానంలో కొనసాగుతోంది. ప్లేఆఫ్ అవకాశాలను మెరుగు పరుచుకోవాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్‌లోనూ భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి హైదరాబాద్‌కు ఏర్పడింది. చెన్నైతో జరిగిన కిందటి మ్యాచ్‌లో విజయం సాధించడంతో సన్‌రైజర్స్ ఆత్మవిశ్వాసం కాస్త పెరిగింది.
ఈ మ్యాచ్ తర్వాత కాస్త విరామం లభించడంతో హైదరాబాద్ ఆటగాళ్లు మారిషస్‌లో సేదా తీరారు. ప్రస్తుతం ఆటగాళ్లు ఉత్సా హంతో కనిపిస్తున్నారు. అయితే పటిష్టమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ కలిగిన గుజరాత్‌తో అనుకున్నంత తేలికేం కాదు. ఇంతకు ముందు ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో సన్‌రైజర్స్ ఓటమి కూడా పాలైంది.
దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని హైదరాబాద్ భావిస్తోంది. కానీ చాలా బలంగా ఉన్న టైటాన్స్‌ను ఓడించాలంటే సర్వం ఒడ్డి పోరాడక తప్పదు.ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లు కీలకంగా మారారు. అభిషేక్ శర్మ, హెడ్‌లు ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నారు.
పంజాబ్‌తో జరిగిన పోరులో మాత్రమే అభిషేక్ రాణించాడు. మిగతా మ్యాచుల్లో పూర్తిగా నిరాశ పరిచాడు. కనీసం మిగిలిన పోటీల్లోనైనా అతను తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. హెడ్ కూడా ఆరంభంలో బాగానే ఆడినా తర్వాత పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నాడు. అతని వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది.
హెడ్, అభిషేక్‌లు తమ మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే హైదరాబాద్ బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తేలిపోతాయి. మరోవైపు ఇషాన్ కిషన్ కూడా చెత్త బ్యాటింగ్‌తో తేలిపోతున్నాడు. తొలి మ్యాచ్‌లో శతకం తప్పించి ఇషాన్ దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ విఫలమ య్యాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇషాన్ పూర్తిగా విఫలం కావడం జట్టును కలవరానికి గురి చేస్తోంది.
ఇకపై జరిగే మ్యాచుల్లో నైనా అతను తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగాల్సిన అవసరం ఉంది. ఇక హెన్రిచ్ క్లాసెన్ ఒక్కడే కాస్త నిలక డగా బ్యాటింగ్ చేస్తున్నా డు. ఈ మ్యాచ్‌లో కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. కమిందు మెండిస్, అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి తదితరులు కూడా తమ వంతు పాత్ర సమర్థంగా పోషించాలి. బౌలింగ్‌లో కూడా షమి, కమిన్స్, హర్షల్, మెండిస్ తది తరులు సత్తా చాటాల్సిన అవసరం ఉంది.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగా ల్లో మెరుగైన ప్రదర్శన చేస్తేనే హైదరాబాద్‌కు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.కిందటి సారి హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన గుజరాత్ ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిం చాలని భావిస్తోంది. బ్యా టింగ్, బౌలింగ్ విభాగాల్లో టైటాన్స్ సమతూకంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితా న్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లకు జట్టులో కొదవలేదు. ఓపెన ర్లు గిల్, సాయి సుదర్శన్ అద్భుత ఫామ్‌లో ఉన్నారు.
జోస్ బట్లర్ కూడా నిలకడైన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకుంటున్నా డు. సిరాజ్, రషీద్ ఖాన్, ఇషాంత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ట వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టులో ఉన్నారు. రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న గుజరాత్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.