సండే డబుల్ ధమాకా!

*సండే డబుల్ ధమాకా!*

*హైదరాబాద్:ఏప్రిల్ 20*

ఐపీఎల్ 2025లో ఇప్పటికే సగం మ్యాచులు పూర్త య్యాయి. ఈ సీజన్‌లో ప్రతి మ్యాచ్ తీవ్ర ఉత్కంఠగా కొనసాగుతుంది. మెగా వేలం తర్వాత జరుగు తున్న మొదటి సీజన్ కావడంతో అయా జట్లు ఊహించిన దాని కంటే భిన్నంగా ఆడుతూ.. పాయింట్ల పట్టికలో టాప్ స్థానాల్లో కొనసాగుతున్నాయి.

అలాగే భారీ అంచనాలు ఉన్న కీలక జట్లు దారుణమైన ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతున్నా యి. ఇదిలా ఉంటే ఈ సీజన్ లో సగం మ్యాచులు పూర్తవడంతో నేటి నుంచి రివేంజ్ వీక్ ప్రారంభం కానుంది. ఈ వారంలో గత మ్యాచుల్లో ఓడిన, గెలిచిన జట్లు తమ ప్రత్యర్థులపై రివేంజ్ తీసుకునేందుకు అవకాశం కలగనుంది.

అలాగే ఈ రోజు ఆదివారం కావడంతో డబుల్ డెక్కర్ మ్యాచులు నిర్వహించను న్నారు. కాగా మొదటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ జట్లు తలపడను న్నాయి.ఈ మ్యాచ్ మధ్యా హ్నం 3. 30 గంటలకు చంఢీఘర్ వేదికగా జరగనుంది.

ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్ రేసుకు అతి చేరువలోకి వెళ్తుంది. రాత్రి జరిగే రెండో మ్యాచులో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7. 30 గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది.

అయితే ఐదు సార్లు చాంపియన్స్ గా నిలిచిన చెన్నై జట్టు ఈ సీజన్ లో దారుణమైన ఓటములతో పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే 7 మ్యాచులు ఆడిన చెన్నై జట్టు ఈ మ్యాచులో ఓడితే మాత్రం ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంటుంది.

దీంతో ఈ మ్యాచ్ ఆ జట్టుకు డూ ఆర్ డై మ్యాచ్‌గా నిలవనుంది. మరీ ఈ రెండు మ్యాచుల లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే మ్యాచ్ చివరి వరకు వేచి చూడాల్సిందే.

Join WhatsApp

Join Now