సింగరేణి కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 

రిటైర్డ్ కార్మికులకు హెల్త్ కార్డు పై అవకాశం కల్పించాలి 

సింగరేణి సంస్థకు నాటి రిటైర్డ్ కార్మికులే పునాదిరాళ్లు 

మాతంగి లింగ లింగయ్య, 

అన్యం లక్ష్మీనారాయణ, అధ్యక్ష, కార్యదర్శులు

ప్రశ్న ఆయుధం న్యూస్ ఏప్రిల్ 22 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి

దేశానికి వెలుగులు అందించే సింగరేణి సంస్థ ఎంతో కనకేర్తి గడిచినది ఆనాటి సిమిలి లైటు పట్టుకొని ప్రమాదాలను లెక్క చేయక ప్రాణాలను సైతం పణంగా పెట్టి నల్లని బంగారాన్ని వెలికి తీసిన సింగరేణి కార్మికులు చాలామంది పరమపదించారు, బ్రతికున్న కార్మికులు సంస్థ అభివృద్ధి కోసం

వారి జీవితాన్ని పణంగా పెట్టి ఆనాడు చాలి చాలని జీతాలకు పనిచేసే, ఈనాడు 1000 700 పెన్షన్ తీసుకునే కార్మికులు కూడా ఉన్నారంటే ఆశ్చర్యమే మరి, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి పెరుగుతున్న ధరలను దృశ్య పెన్షన్ పెరుగుతున్న సింగరేణి కార్మికులకు పెరగకపోవడం దురదృష్టకరం, కనీసం వారి ఆరోగ్య పరిరక్షణ కోసమైనా సంస్థ ఆలోచన చేయాలని అందులో భాగంగా హైదరాబాదులో ప్రస్తుతం సింగరేణి కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను నిర్మించ తలపెట్టడం అభినందనీయం అన్నారు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అధ్యక్ష కార్యదర్శులు మాతంగి లింగయ్య, అన్యం లక్ష్మీనారాయణ గార్లు

సి ఎన్ఎం డి బలరాం నాయక్ సింగరేణిలో సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఏర్పాటు చేయడానికి సింగరేణి వర్కర్స్ యూనియన్ ఏఐటియు తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారంగా ఏర్పాటు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు మాతంగి లింగయ్య అన్యం లక్ష్మీనారాయణ ఇప్పటివరకు సింగరేణిలో సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఏర్పాటు చేయలేదు నేడు సింగరేణిలో కూడా సూపర్ హైదరాబాదులో ఏర్పాటు చేసి సింగరేణి కార్మికులకు ప్రవేట్ హాస్పిటల్ కి పోకుండా చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు, సింగరేణి కార్మికులతో కాకుండా సింగరేణిలో 30 40 సంవత్సరాలు శ్రమచేసి దిగిపోయిన రిటైర్డ్ కార్మికులు కూడా అనేకమంది ఉన్నారు వారికి కూడా హెల్త్ కార్డులు ఉన్నాయి హెల్త్ కార్డు లేనివారు ఉన్నవారు కూడా ఈ సింగరేణి సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ లో రిటైర్డ్ కార్మికులకు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని అట్లాగే కొత్తగూడెం లోని హాస్పిటల్ కూడా సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ గా తయారు చేస్తే బాగుంటుందని మరియు హైదరాబాదులో సింగరేణి సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది సింగరేణి సిక్కి ఇండస్ట్రియల్ గా గవర్నమెంట్ గుర్తించినప్పుడు 30 సంవత్సరాల కిందట కష్టపడి కార్మికులు నుంచి లాభాల బాటలో తీసుకొచ్చి ఇండస్ట్రీ కంపెనీని కాపాడిన రిటైర్డ్ కార్మికులు కూడా ఆరోగ్య స్థితిలో వేరే హాస్పటల్ పోయి బాగు చేయించుకునే దానికి కన్నా సింగరేణి సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ లో సౌకర్యం కలగజేస్తే దాంట్లో రిటైర్డ్ హెల్త్ కార్డు కాకుండా రిటైర్డ్ కార్మికులకు కూడా సౌకర్యం కలగజేసి సింగరేణి రిటైర్డ్ కార్మికులకు కూడా మేలు కలగజేయాలని సింగరేణి అధికారులకు మరియు మన సింగరేణి సిఎన్ఎం శ్రీ బలరాం నాయక్ కి ట్రేడ్ యూనియన్ నాయకులకు మా యొక్క రిటైర్డ్ కార్మికుల సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తున్నామని మాతంగి లింగయ్య అన్యం లక్ష్మీనారాయణ గార్లు విన్నవించుకున్నారు

Join WhatsApp

Join Now