Site icon PRASHNA AYUDHAM

పెన్షన్ రాని వృద్ధురాలికి సూపరిండెంట్ ఆర్థిక సహాయం

IMG 20250628 190717

Oplus_0

సంగారెడ్డి/పటాన్ చెరు, జూన్ 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామంలో మూడు నెలలుగా వృద్ధాప్య పెన్షన్ రాని వృద్ధురాలికి ఎంపీడీవో కార్యాలయ సూపరిండెంట్ వెంకటేశ్వర్లు తనవంతు సాయం అందజేశారు. ఇంద్రేశం గ్రామంలో కమలమ్మ అనే వృద్ధురాలికి మూడు నెలల పెన్షన్ రాకపోవడంతో ఎంపీడీవో కార్యాలయ సూపరిండెంట్ వెంకటేశ్వర్లు ఆర్థిక సహాయం అందజేయగా.. శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో కారోబార్ సాయికుమార్ వృద్ధురాలికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ సుభాష్, సిబ్బంది మహేష్, బాలు, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.

Exit mobile version