రాజంపేటలో నామినేషన్ పర్యవేక్షణ
జిల్లా అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి సందర్శనం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్నఆయుధం నవంబర్ 29
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను జిల్లా అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి పర్యవేక్షించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని సందర్శించిన అదనపు ఎస్పీ, భద్రతా ఏర్పాట్లు, క్యూలైన్ల నిర్వహణ, పోలీసు సిబ్బంది విధులను పరిశీలించారు. అభ్యర్థులు, ప్రతినిధులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి అభ్యర్థి, ఓటరు నమ్మకంగా పాల్గొనేలా సమగ్ర చర్యలు తీసుకున్నామని తెలిపారు.