సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లాలో యూరియా ఎరువుల సరఫరా ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. జిల్లాలోని అన్ని PACS, సహకార సంఘాలు, అగ్రో కేంద్రాలు, HACA, DCMS కేంద్రాలు, ప్రైవేట్ డీలర్ల వద్ద యూరియా సరిపడి నంత స్టాక్ అందుబాటులో ఉందని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 4,766 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ అందుబాటులో ఉందని, ఇందులో సహకార సంఘాల వద్ద 444 మెట్రిక్ టన్నులు,ప్రైవేట్ డీలర్ల వద్ద 502 మెట్రిక్ టన్నులు,మార్క్‌ఫెడ్ బఫర్ స్టాక్ 3,819 మెట్రిక్ టన్నులు ఉన్నాయని పేర్కొన్నారు. యూరియా సరఫరా విడతల వారీగా కొనసాగించబడుతున్నందున రైతులు ఎటువంటి ఆందోళనకు, అపోహలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా యూరియా పంపిణీ సక్రమంగా జరిగేలా అందరు ఏ డి ఎ లు, ఏవోలు, AEOలు అందుబాటులో ఉండి నిరంతరం పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినట్లు వెల్లడించారు. రైతులందరూ ప్రశాంతత తో అవసరమైన మేరకు యూరియా కొనుగోలు చేయాలని కోరారు. అనవసరంగా అధికంగా కొనుగోలు చేయకుండా సహకరించాలని సూచించారు. యూరియా సరఫరా, పంపిణీ ప్రక్రియను పర్యవేక్షిస్తూ, రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు.
యూరియా సరఫరా నిరంతరంగా కొనసాగుతుంది: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
Oplus_16908288