ఆటో డ్రైవర్ లను ఆదుకోండి

*ఆటో డ్రైవర్ లను ఆదుకోండి*

-:ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం సంక్షేమం కలిగించక పోతే ఉద్యమం తథ్యం… బిపిటియంయం జాతీయ ప్రధాన కార్యదర్శి

రవిశంకర్ అల్లూరి.

సంగారెడ్డి జనవరి 17

బియంయస్ అనుబంధ తెలంగాణ ఆటో&ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మొగులయ్య ఆధ్వర్యంలో జోగిపేట బస్ స్టాండ్ వద్ద ఆటో డ్రైవర్ల సభ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన బిపిటియంయం జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి బియంయస్ జండా ఆవిష్కరణ చేసారు.

ముఖ్య అతిథి విచ్చేసిన రవిశంకర్ మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణం వలన తెలంగాణ లో ఆటో డ్రైవర్ల బతుకులు ఆగం అయ్యాయని , అనేక మంది ఆటో డ్రైవర్లు ఆర్థిక బాధలు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన చెందారు. డ్రైవర్లు ధైర్యంగా ఉండాలని మంచి రోజులు తప్పకుండా వస్తాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారి కుటుంబాలకు వైద్య సౌకర్యం కల్పించాలని అన్నారు.పిల్లలకు కార్పొరేట్ స్కూల్ లో ఉచిత విద్య కల్పించాలని కోరిన రవిశంకర్ ఆటో డ్రైవర్లకు డబల్ బెడ్ రూం మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్యాంకుల ద్వారా ముద్ర లోన్ సౌకర్యం కలుగచేసి ప్రైవేట్ ఫైనాన్సర్ల బారి నుండి కాపాడాలని అన్నారు. బియంయస్ ద్వారా ఆటో డ్రైవర్లకు 15 లక్షల బీమా సౌకర్యం కలుగచేయడానికి త్వరలో బీమా శిబిరం ఏర్పాటు చేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని విస్మరిస్తే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ మజ్దూర్ మహా సంఘ్ ప్రతినిధులు యం.డి హాబీబ్, శ్రీధర్ రెడ్డి బియంయస్ జిల్లా అధ్యక్షులు నరసింహ రెడ్డి, కార్యదర్శి పి.మోహన్ రెడ్డి మరియు బియంయస్ రాష్ర్ట కార్యవర్గ సభ్యులు ఆకుల శంకర్, జోగిపేట ఆటో యూనియన్ నాయకులు బాబుల్, జాఫర్, తాజ్ భాయ్, ఆబెద్, విజయ్, సత్యనారాయణ,

రవీందర్, వాహెద్, గోవర్ధన్, రవి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now