Headlines
-
“బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా కామారెడ్డిలో హిందూ ఐక్య వేదిక ర్యాలీ”
-
“హిందూ ఐక్యతకు మద్దతుగా బంగ్లాదేశ్ హిందువుల రక్షణకు పిలుపు”
-
“బంగ్లాదేశ్ దాడులను నిరసిస్తూ కామారెడ్డిలో డిసెంబర్ 4న ర్యాలీ”
-
“ఇస్కాన్ స్వామీజీ అరెస్టును ఖండించిన హిందూ ఐక్య వేదిక నాయకులు”
-
“బంగ్లాదేశ్ హిందువుల దుస్థితిపై హిందూ ఐక్యతకు పిలుపు
బంగ్లాదేశ్ హిందువులకు మద్దతు తెలపాలి
–హిందూ ఐక్య వేదిక నాయకులు
ప్రశ్న ఆయుధం న్యూస్, డిసెంబర్ 2, కామారెడ్డి :
హిందూ ఐక్యతను చాటి చెప్పి బంగ్లాదేశ్ హిందువులకు మద్దతు తెలపాలని హిందూ ఐక్య వేదిక నాయకులు అన్నారు.
బంగ్లాదేశ్ లో గత కొంత కాలంగా హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా కామారెడ్డిలో బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా ర్యాలీ నిర్వహిస్తున్నట్టు హిందూ ఐక్య వేదిక నాయకులు జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వీహెచ్ పి జిల్లా అధ్యక్షుడు నిత్యానందం, అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు గందే శ్రీనివాస్, పవన్ కుమార్ శర్మలు మాట్లాడుతూ… బంగ్లాదేశ్ హిందువులపై దాడులను నిరసిస్తూ, ఇస్కాన్ స్వామీజీ చిన్మయి ప్రభుదాస్ అరెస్టును ఖండిస్తూ, బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు ఆపాలని తెలియజేస్తూ, ఈ సందర్భంగా కామారెడ్డిలో ర్యాలీ నిర్వహించనున్నామని తెలిపారు. కామారెడ్డి జిల్లా హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో డిసెంబర్ 4 న గాంధీ గంజ్ నుండి ఉదయం 10 గంటలకు ప్రారంభమై జిల్లా కేంద్రంలోని పుర వీధుల గుండా ర్యాలీ ఉంటుదని తెలిపారు. జిల్లా నలుమూలల నుండి హిందూ బంధువులు తరలి రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐక్య వేదిక నాయకులు శ్రీకాంత్, భరత్, వెంకటస్వామి, శ్రీనివాస్, రవీందర్, ప్రవీణ్ , లింగారవ్, రాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.