వికలాంగుల మహా గర్జనకు జర్నలిస్టుల మద్దతు
గజ్వేల్‌లో వికలాంగుల పెన్షన్ పెంపునకు మద్దతుగా సన్నాహక సమావేశం
టీజేయు రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు, ఐఎఫ్డబ్ల్యూజే కార్యదర్శి భరత్ కుమార్ శర్మ హాజరు
రాష్ట్ర, జిల్లా స్థాయి పలువురు జర్నలిస్టు నేతలు పాల్గొనాలి
వికలాంగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆహ్వానించాలంటూ డిమాండ్
గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన నేతలు పోరాటానికి సిద్ధం
గజ్వేల్, ఆగస్టు 3 (ప్రశ్న ఆయుధం):
వికలాంగుల పెన్షన్ పెంపు కోరుతూ జరుగనున్న వికలాంగుల మహా గర్జన కార్యక్రమానికి మద్దతుగా గజ్వేల్‌లో జరిగిన సన్నాహక సమావేశంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ (టీజేయు) కీలకంగా పాల్గొంది. టీజేయు రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద రావు, ఐఎఫ్డబ్ల్యూజే కార్యదర్శి డాక్టర్ భరత్ కుమార్ శర్మ సమావేశానికి హాజరై సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కనుక రెడ్డి, జిల్లా అధ్యక్షులు వక్కల శ్రీనివాస్, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీకాంత్ చారి, గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు గుడాల చంద్రశేఖర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల సమస్యల పరిష్కారానికి జర్నలిస్టులు సంఘీభావంగా నిలుస్తామని వారు స్పష్టం చేశారు.
ఈ గర్జన తలపెట్టిన లక్ష్యం వికలాంగులకు న్యాయమైన పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడమేనని నిర్వాహకులు తెలిపారు.