శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు..

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు: పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ ట్వీట్

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు..

IMG 20240930 WA0039

దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగవద్దన్న కోర్టు వ్యాఖ్యలను పేర్కొన్న ప్రకాశ్ చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలతో ట్వీట్..ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై మరో ట్వీట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఘటనపై ఈరోజు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందుకు సంబంధించిన సమాచార క్లిప్పింగ్‌ను ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేస్తూ ‘దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి’ అని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.ప్రకాశ్ రాజ్ పోస్ట్ చేసిన క్లిప్పింగ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలు ఉన్నాయి. తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని, దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని సూచించిందని అందులో పేర్కొన్నారు.ల్యాబ్ రిపోర్ట్ సవివరంగా లేదని, లడ్డూ తయారు చేసే నెయ్యి కల్తీ అయినట్లుగా సాక్ష్యాలు లేవని, అలాంటప్పుడు మీరు నేరుగా మీడియా ముందుకు ఎందుకు వెళ్లారని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించిన విషయాన్ని పేర్కొన్నారు. లడ్డూకు సంబంధించిన రిపోర్ట్ ఎప్పుడో జులైలో వస్తే మీరు ఇప్పుడు స్టేట్‌మెంట్ ఎందుకు ఇచ్చారని సుప్రీంకోర్టు ప్రశ్నించిన విషయాన్ని పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now