వీధి కుక్కలపై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు
డిల్లీ NCRలో వీధి కుక్కల తరలింపు ఆదేశాలను సవరించిన సుప్రీంకోర్టు
జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి. అంజరియాలతో కూడిన ధర్మాసనం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
📌 కోర్టు కీలక ఆదేశాలు:
1️⃣ క్రూరంగా / హాని చేసే కుక్కలకే షెల్టర్ – అన్ని వీధి కుక్కలను తరలించాల్సిన అవసరం లేదు.
2️⃣ ఆహారం పెట్టే ప్రత్యేక ప్రాంతాలు – మున్సిపాలిటీలు నిర్ణయించిన ప్రదేశాల్లోనే ఆహారం పెట్టాలి.
3️⃣ టీకాలు వేసిన కుక్కల విడుదల – స్టెరిలైజ్ చేసిన కుక్కలను తిరిగి వాటి ప్రాంతాల్లో విడిచిపెట్టాలి.
4️⃣ దత్తత అవకాశం – జంతు ప్రేమికులు షెల్టర్లలోని కుక్కలను దత్తత తీసుకోవచ్చు.
5️⃣ మున్సిపల్ అధికారులకు అడ్డంకులు వద్దు – Animal Birth Control నిబంధనల ప్రకారం వారి చర్యలు సాగాలి.
6️⃣ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు – వీధిలో ఆహారం పెడితే చట్టపరమైన చర్యలు తప్పవు.
7️⃣ కొత్త షెల్టర్ల ఏర్పాటు – ఢిల్లీలో కొత్త డాగ్ షెల్టర్లు, పౌండ్లు ఏర్పాటు చేయాలని ఆదేశం.
8️⃣ జంతు సంక్షేమం పర్యవేక్షణ – స్థానిక సంస్థలు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలి.
9️⃣ ప్రజల సహకారం అవసరం – కుక్కల దాడులను తగ్గించేందుకు సమాజం సపోర్ట్ చేయాలి.
🔟 తదుపరి విచారణ – ఈ కేసు పై చివరి విచారణ 8 వారాల తర్వాత జరుగనుంది.