*_తెలంగాణ: ఫిరాయింపులపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు..!!_*
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణ జరుగుతోంది. జస్టిస్ బీఆర్ గవాయ్, ఆగస్టీన్ జార్జ్ మసీహ్‌ల తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై వాదనలు వింటోంది.
ఇరుపక్షాల వాదనలతో.. మధ్యలో బెంచ్ జోక్యంతో.. హాట్ హాట్‌గా వాదనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఫిరాయింపులపై సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఆయారాం, గయారాంలను నిరోధించేందుకే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ఉంది. అలాంటప్పుడు పార్టీ ఫిరాయింపుల విషయంలో ఏ నిర్ణయం అనేది తీసుకోకపోతే ఆ షెడ్యూల్‌ను అపహాస్యం చేయడం కిందకే వస్తుంది.
: జస్టిస్ బీఆర్ గవాయ్, ఆగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం
బీఆర్‌ఎస్ వాదనలు
2024 మార్చి 18న మొదట ఫిరాయింపులపై శాసనసభ స్పీకర్ ఫిర్యాదు చేశాం: : బీఆర్‌ఎస్ న్యాయవాది ఆర్యమా సుందరం
మొదటి ఫిర్యాదు చేసినా నోటీసులు ఇవ్వలేదు
హైకోర్టుకు వెళ్లేంత వరకు కూడా నోటీసులు ఇవ్వలేదు
రీజనబుల్ టైంలోనే చర్యలు తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ చెప్పింది
హైకోర్టు చెప్పినా ఎలాంటి చర్యలు లేవు
దానం నాగేందర్‌పై ఫిర్యాదు చేసినా.. ఆయనకు నోటీసులు ఇవ్వలేదు
దానం ఎంపీగా పోటీ చేసినా చర్యల్లేవ్
కడియంకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నా.. చర్యలు లేవ్
అనర్హత పిటిషన్ విచారణపై షెడ్యూల్ చేయాలని.. హైకోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చింది
స్పీకర్ 7 రోజుల సమయం ఇస్తూ నోటీసులు ఇచ్చారు
ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకేరకంగా సమాధానం ఇచ్చారు
పార్టీ మారినవాళ్లు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు
ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు ప్రచారం చేశారు
నోటీసులు ఇచ్చామని స్పీకర్ అంటున్నారు.. కానీ, ఆ కాపీలు మాకు అందజేయలేదు
స్పీకర్ అధికారాలు సైతం న్యాయసమీక్ష పరిధిలోనే ఉంటాయి
న్యాయ సమీక్షకు స్పీకర్ అతీతులు కాదు
ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయంపై నిర్దిష్టమైన గడువు విధించాలి
కౌంటర్ దాఖలుకు మరింత సమయం కోరిన ప్రతివాదులు
ప్రతివాదులపై సుప్రీం కోర్టు ఆగ్రహం
కాలయాపన చేసే విధానాలు మానుకోవాలి
ధర్మాసనం ఆగ్రహం
ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడానికి ఇంకా ఎంత కాలం పడుతుంది?: ధర్మాసనం
ఆలస్యం చేసే ఎత్తుగడలు అనుసరించొద్దు
ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఫిర్యాదు వచ్చి ఎంతకాలమైంది: ధర్మాసనం
రీజనబుల్ టైం అంటే గడువు ముగిసేవరకా?
మొదటి ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత టైం గడిచింది.
నాలుగు వారాలైనా షెడ్యూల్ ఫిక్స్ చేయలేదా?
అదృష్టవశాత్తూ ఎమ్మెల్యేలు 4 ఏళ్లు ఆగలేదు
మూడు వారాల సమయం విషయంలో మాత్రం స్పీకర్ రీజనబుల్‌గా ఉన్నారు
తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పులో డివిజన్ బెంచ్ జోక్యం సరైందో కాదో చూస్తాం?
స్పీకర్ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు..
స్పీకర్ తరఫున కౌంటర్ దాఖలు చేసిన కార్యదర్శి
స్పీకర్‌ను ఆదేశించే అధికారం న్యాయస్థానానికి ఉంటుందా?
రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలా?
ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు తామేం పార్టీ ఫిరాయించలేదంటూ అఫిడవిట్లలో పేర్కొన్నారు. తాజాగా.. పిటిషనర్ల ఉద్దేశాలను తప్పుబడుతూ స్పీకర్ తరఫున కౌంటర్‌ను అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేశారు.
”రీజనబుల్ టైం అంటే గరిష్టంగా మూడు నెలలే అని అర్థం కాదు. ఒక్కో కేసు విచారణకు ఒక్కో రకమైన సమయం అవసరం. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చాం. కానీ, స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వెంటనే కోర్టుకు వెళ్లారు. స్పీకర్ ఈ అంశంపై నిర్ణయం తీసుకున్న తర్వాతే.. న్యాయపరమైన పరిష్కారం కోసం ప్రయత్నించాలి. అప్పటిదాకా న్యాయస్థానాల జోక్యం కుదరదు.
.. అనర్హత పిటిషన్ లను విచారించి నిర్ణయం తీసుకునే అధికారం కేవలం స్పీకర్ కే ఉంది. గత సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఇదే అంశాన్ని చెబుతున్నాయి. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వెంటనే….పిటీషనర్లే దురుద్దేశపూర్వకంగా కోర్టును ఆశ్రయించారు. ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదన్నది సరికాదని.. చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని.. కాబట్టి ఈ పిటిషన్లను డిస్మిస్ చేయాలి” అని కోరారు.
👉కారు గుర్తుపై గెలిచి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టేలా స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని కోరుతూ బీఆర్‌ఎస్ పార్టీ(BRS Party) జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్‌లపై స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు అయ్యింది. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీలపై రిట్ పిటిషన్ దాఖలైంది. వీటిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపింది సుప్రీం కోర్టు(Supreme Court). కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి, ఇతర బీఆర్‌ఎస్ నేతలు ఈ పిటిషన్లు వేశారు. అయితే..
👉పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించి నెలలు గడుస్తున్నా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీఆర్‌ఎస్ వాదిస్తోంది. ఈ క్రమంలో.. గత విచారణ సందర్భంగా స్పీకర్, స్పీకర్ కార్యదర్శి, ప్రభుత్వం, ఎన్నికల సంఘం, 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. మార్చి 22వ తేదీలోపు దీనిపై రిప్లై ఇవ్వాలని ఆదేశించింది.
కొద్దిరోజుల క్రితం మహిపాల్‌రెడ్డి, తాజాగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అఫిడవిట్‌లు దాఖలు చేశారు. తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని, పార్టీ ఫిరాయింపు ఆరోపణల్లో వాస్తవం లేదని అందులో పేర్కొన్నారు. కేవలం ఎమ్మెల్యే హోదాలోనే సీఎంను కలిశామని తెలిపారు. అందువల్ల తమపై దాఖలైన కేసులను కొట్టివేయాలని అభ్యర్థించారు. బీఆర్ఎస్‌కు తాము రాజీనామా చేయలేదని.. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ చేరలేదని.. మీడియాలో వచ్చిన వార్తలలో నిజం లేదని.. కాబట్టి ఈ అనర్హత పిటీషన్లకు విచారణ అర్హత లేదని వాటిల్లో పేర్కొన్నారు. ఈ మేరకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఉన్న ఫొటోలు, పోస్టర్లను, తమ ఫొటోలతో కూడిన పార్టీ ఫ్లెక్సీల ఫొటోలనూ అఫిడవిట్‌లో జత చేశారు. తాజాగా.. సోమవారం(మార్చి 24) స్పీకర్ తరఫున అసెంబ్లీ కార్యదర్శి కూడా అఫిడవిట్ వేశారు.
ఇప్పటికే ఈ కేసు విచారణలో సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. గతంలో తెలంగాణ స్పీకర్పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తగినంత సమయం అంటే ఎంతో చెప్పాలని కోరింది. గత విచారణలో.. ఆపరేషన్ సక్సెస్ , పేషంట్ డెడ్ అనే తీరు సరికాదన్న పేర్కొంది.