మాజీ మంత్రి కేటీఆర్ కు సుప్రీంకోర్టు షాక్..?

*మాజీ మంత్రి కేటీఆర్ కు సుప్రీంకోర్టు షాక్?*

హైదరాబాద్: జనవరి 15

ఫార్ములా ఈ-రేసు కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది, హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో SLP వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. దీంతో బేలా ఎం. త్రివేది ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరగాలని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ కేసులో పూర్తిస్థాయిలో విచారణ జరపాలని, న్యాయస్థానం అభిప్రాయ పడింది, దీంతో కేటీఆర్ విచారణ ఎదుర్కోను న్నారు . ఇప్పటికే ఏసీబీ ఆయనను ఒకసారి విచారించింది, మరోసారి కుడా విచారించనుంది.

Join WhatsApp

Join Now