Headlines
-
కస్తూర్బా పాఠశాలలో తహసీల్దార్ అరిఫా, ఎంపీడీవో అప్జలుద్దీన్ ఆకస్మిక తనిఖీ
-
కస్తూర్బా పాఠశాల మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సమస్యలు పరిశీలించిన అధికారులు
-
విద్యార్థులకు నాణ్యమైన విద్య ఇవ్వాలని తహసీల్దార్ అరిఫా, ఎంపీడీవో అప్జలుద్దీన్ సలహా
-
కస్తూర్బా పాఠశాలలో భోజనశాల, వంటగది సౌకర్యాలను పరిశీలించిన అధికారులు
-
తహసీల్దార్ మరియు ఎంపీడీవో విద్యార్థులకు ఆకస్మిక తనిఖీ: భవిష్యత్తులో ఉన్నత స్థానం సాధించాలనిప్రకటించగలిగారు
మర్కుక్ మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మంగళవారం నాడు ఎంపీడీవో అబ్జాలుద్దీన్,ఎమ్మార్వో అరిఫా సందర్శించారు.పాఠశాలలో ఉన్న సమస్యలు,మౌలిక సదుపాయాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.పాఠశాల ఆవరణలో ఉన్నటువంటి వంటగది,భోజనశాల,స్టోర్ రూమ్ ను,త్రాగునీటిని పరిశీలించారు.పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని విద్యార్థులతో మాట్లాడారు.అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి వంట సిబ్బందిని మెనూ గురించి అడిగి తెలుసుకున్నారు.ఎంపీడీవో అబ్జాలుద్దీన్,తహసీల్దార్ ఆరిఫా మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వం యొక్క లక్ష్యమని,బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు రావాలని అన్నారు.వారితో పాటు ప్రధానోపాధ్యాయులు భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు.