- ఏడు నెలల్లో లొంగిపోండి – మావోయిస్టులకు డీజీపీ గుప్తా హెచ్చరిక
- విజయవాడలో కీలక పరిణామం – సీనియర్ మావోయిస్టు దంపతులు లొంగింపు
మావోయిస్టులందరూ వచ్చే 7 నెలల్లోగా లొంగిపోవాలని రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. విజయవాడలో ఆయన ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది.
లొంగిపోయిన వారిలో కీలకంగా పేరొందిన సీనియర్ మావోయిస్టు దంపతులు నాగరాజు – అరుణ ఉన్నారు. వీరిద్దరిపై ప్రభుత్వం ₹25 లక్షల రివార్డ్‌ను ప్రకటించి ఉండగా… ఇప్పుడు వారు నేరుగా పోలీసులకు లొంగిపోయారు.
డీజీపీ గుప్తా మాట్లాడుతూ – “నాగరాజు, అరుణ దంపతులకు తక్షణ ఉపశమనంగా ₹40,000 ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పునరావాస విధానంలో భాగంగా వారికి మద్దతు అందిస్తాం,” అని తెలిపారు.
అదే సమయంలో AOB పరిధిలోని ఓ డంప్ నుంచి పోలీసులు భారీగా ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారని ఆయన వెల్లడించారు.మావోయిస్టులు హింస మార్గాన్ని విడిచిపెట్టి… సమాజంలో భాగస్వాములై రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని డీజీపీ గుప్తా పునరుద్ఘాటించారు.