లొంగిపోయిన మావోయిస్టులు..

నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన నలుగురు ఏరియా కమిటీ సభ్యులతో పాటు ఒక ధళ సభ్యురాలి లొంగుబాటు 28.12.2024 న నిషేదిత సీపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన (04) ఏరియా కమిటీ సభ్యులు మరియు ఒక దళసభ్యుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, 81Bn మరియు 141 బెటాలియన్ సిఆర్పిఎఫ్ అధికారుల ఎదుట స్వచ్ఛందంగా

లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యుల వివరములు:-

1. పూనెం పాక్షి, Dio కొవ్వల్, 27 సం, Rio పెద్దగెల్లూరు గ్రామం, తర్రెమ్ PS, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్ఘడ్ రాష్ట్రం, (ACM, బాసగూడ LOS, DKSZC CPI (మావోయిస్ట్) దక్షిణ బస్తర్ DVC).

2. వెట్టి దేవ @ బాలు, S/o దేవయ్య, 21సం, గుత్తికోయ, Rio ఎర్రంపాడు గ్రామం, చర్ల మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్రం, (ACM, ໖໒ ໓, BK-ASR DVC, TSC (CPI).

3. మడకం ఉంగి @ గంగి, W/o వెట్టి బాలు, @ దేవ (ACM, చర్ల ప్లాటూన్), 22 సం,Rio. చెన్నాపురం గ్రామం, చర్ల మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్రం, (ACM, చర్ల LOS, BK-ASR DVC- CPI మావోయిస్టు)

4. రవ్వ సోమ S/o సూల, 25 సం, Rio ఇర్రపల్లి గ్రామం, పామేడు PS, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం, (ACM, పామేడు ఏరియా కమిటీ, -Instructor team)

5. మడివి గంగి D/o మసల్, 23 సంవత్సరాలు, R/O. రాసపల్లి, పామేడ్ PS, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్ఘడ్ రాష్ట్రం, (పార్టీ మెంబర్ పామేడ్ LOS- CPI మావోయిస్ట్).

పూనెం పాక్షి 2016 సంవత్సరంలో CNM సభ్యురాలిగా నిషేదిత సీపిఐ మావోయిస్ట్ పార్టీలో చేరి, 2018 సంవత్సరం లో ధళ సభ్యురాలిగా అనంతరం 2022 లో బాసగూడ LOS ఏరియా కమిటీ సభ్యురాలిగా పదోన్నతి పొంది అగ్రనాయకుల ఆదేశాల మేరకు పలు విధ్వంసకర ఘటనలలో పాల్గొనడం జరిగింది. ఈమెపై 04 లక్షల రూపాయల రివార్డ్ కలదు

వెట్టి దేవ @ బాలు 2018 సంవత్సరంలో నిషేదిత సీపిఐ మావోయిస్ట్ పార్టీలో సభ్యుడిగా చేరినాడు. 2019 నుండి 2022 వరకు చర్ల LOS లో మిలిషియా సభ్యుడిగా పని చేస్తూ పార్టీ నాయకుల ఆదేశాలతో భద్రతా బలగాలపై ఎన్నో దాడులకు పాల్పడ్డాడు. అనంతరం ఏరియా కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొంది అగ్ర నాయకుల ఆదేశాల మేరకు 2022 ఆగస్ట్ లో కుర్నపల్లిలో ఇర్ప రాముడు ను హత్యచేసిన ఘటనలో, 2023 ఫిబ్రవరిలో కుంజర్ అంబుష్ (CG) దాడిలో ముగ్గురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో 2024 ఆగస్ట్ లో చెన్నాపురంలో నీలో @ రాధా ను హత్యచేసిన ఘటనల్లో కీలకంగా వ్యవహరించాడు. ఇతనిపై 04 లక్షల రూపాయల రివార్డ్ కలదు

మడకం ఉంగి @ గంగి 2018 సంవత్సరంలో CNM సభ్యురాలిగా నిషేదిత సీపిఐ మావోయిస్ట్ పార్టీలో చేరి,2019లో చర్ల LOS కు బదిలీ అయ్యి 2021 లో టేకులగూర్మ(CG) లో మావోయిస్ట్ ల దాడిలో 24 మంది భద్రతా సిబ్బంది చనిపోయిన ఘటనలో కీలకంగా వ్యవహరించినది. అనంతరం 2024 లో చర్ల LOS ఏరియా కమిటీ సభ్యురాలిగా పదోన్నతి పొంది ఇప్పుడు పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగింది.2024 జనవరిలో ధర్మారం మరియు చింతవాగు CRPF క్యాంప్ లపై దాడి ఘటనలలో పాల్గొన్నది. ఈమెపై 04 లక్షల రూపాయల రివార్డ్ కలదు

రవ్వ సోమ 2010 సంవత్సరం లో బాలల సంఘంలో సభ్యుడిగా పార్టీలో చేరి, అనంతరం 2017 నుండి 2021 వరకు ధళ సభ్యుడిగా పామేడ్ ఏరియా, సౌత్ బస్తర్ DVC లో పనిచేసి చత్తీస్ఘడ్లో అనేక విధ్వంసకర ఘటనలలో పాల్గొన్నాడు. అనంతరం 2023 లో ఏరియా కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొంది ఇప్పుడు పామేడ్ ఏరియా Instructor గా పని చేస్తున్నాడు. ఇతనిపై 04 లక్షల రూపాయల రివార్డ్ కలదు

మడివి గంగి 2018 లో బాలల్ సంఘం లో చేరి,2019లో ఎర్రపల్లి RPC లో మిలిషియా సభ్యురాలిగా అనంతరం పామేడ్ LOS లో ధళ సభ్యురాలిగా భద్రతా బలగాలపై ఎన్నో దాడులలో పాల్గొనడం జరిగింది. ఈమెపై లక్ష రూపాయల రివార్డ్ కలదు

గత కొంతకాలంగా లొంగిపోయిన మావోయిస్టు పార్టీ నాయకులు మరియు సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం తరపున జిల్లా పోలీసులు కల్పిస్తున్న సౌకర్యాలను గ్రహించి జనజీవన స్రవంతిలో కలిసి మెరుగైన జీవితం గడపాలని నిశ్చయించుకొని తమ స్వార్థ ప్రయోజనాల కోసం మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు తమపై చూపుతున్న వివక్షను గ్రహించి పూనెం పాక్షి, వెట్టి దేవ, మడకం ఉంగి, రవ్వ సోమ మరియు మడివి గంగి మావోయిస్ట్ పార్టీని వీడి ఈ రోజు పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగినది,

లొంగిపోయి సాధారణ జీవనం గడపాలనుకునే దళ సభ్యులు వారి కుటుంబ సభ్యుల ద్వారా గానీ, స్వయంగా గానీ తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్లో లేదా జిల్లా ఉన్నతాధికారుల వద్ద గానీ సంప్రదించగలరని విజ్ఞప్తి చేస్తున్నాము. లొంగిపోయే దళసభ్యులకు జీవనోపాధి, పునరావాసం కల్పించడం కోసం ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను అందించడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం కృషి చేస్తుంది.

Join WhatsApp

Join Now