రౌడీ షీటర్ల పై నిఘా…!!”

మహబూబాబాద్ జిల్లా…

*రౌడీ షీటర్ల పై పోలీస్ నిఘా*

మహబూబాబాద్ జిల్లా తొర్రుర్ పోలీస్ సర్కిల్ పరిధిలో రౌడీ షీటర్లకు తొర్రుర్ సీఐ జగదీష్ కౌన్సిలింగ్ నిర్వహించారు.

ఎవరైనా అల్లర్లు, గొడవలు, భూ తాగాదలు, అలజడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. చెడు నడత కలిగిన రౌడీ షీటర్లపై పోలీసు నిఘా ఉంటుందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. రౌడీ షీటర్లుగా నమోదైన ప్రతి ఒక్కరూ సంబంధిత స్టేషన్లలో సంతకాలు చేస్తూ ఉండాలన్నారు. బయట ప్రాంతాలకు వెళ్లే సమయంలో స్టేషన్‌ అధికారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. రౌడీ షీటర్ల కదలికలపై ఏదైనా అనుమానం వస్తే వెంటనే అదుపులోకి తీసుకుని బైండోవర్‌ చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో నెల్లికుదురు ఎస్.ఐ రమేష్ బాబు, దంతాలపల్లి ఎస్.ఐ పిల్లల రాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు

Join WhatsApp

Join Now