Site icon PRASHNA AYUDHAM

హాస్టల్ సిబ్బందిని సస్పెండ్ చేయాలీ

IMG 20250623 WA0399

హాస్టల్ సిబ్బందిని సస్పెండ్ చేయాలి

-బహుజన డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వడ్ల సాయి కృష్ణ

కామారెడ్డి జిల్లా తాడ్వాయి

తాడ్వాయి మండల కేంద్రం లోని సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహ వార్డెన్ మరియు సిబ్బందిని సస్పెండ్ చేయాలి.

ఈ సందర్భంగా బహుజన డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వడ్ల సాయి కృష్ణ, మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ బాలికల సంక్షేమ వసతి గృహంలో, తేదీ :20 /06 /2025 ,శుక్రవారం నాడు విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో హాస్టల్ కు ఆలస్యంగా చేరుకున్న విద్యార్థులు,తల్లిదండ్రులతో సహా విద్యార్థులను మండుటెండలో నిలబెట్టి లోపలికి అనుమతించకుండా దాదాపు ఉదయం నుండి సాయంత్రం వరకు హాస్టల్ సిబ్బంది తాళం వేసి హాస్టల్ గేటుకు, లోపలికి రాకుండా అడ్డుకున్నారు .

విద్యార్థులు ఎంత వేడుకున్నా తమ సమస్యలని వివరించినప్పటికి ,

సిబ్బంది కనికరం చూడకుండా ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ

సుమారు నాలుగు గంటల తరబడి విద్యార్థులు మరియు తల్లిదండ్రులు గేటు బైటే నిలబెట్టడం జరిగింది. విద్యార్థుల పట్ల మానవత్వం లేకుండా వ్యవహరించిన హాస్టల్ సిబ్బందిపై మరియు హాస్టల్ ప్రిన్సిపల్ సురేఖపై ఈ ఘటనకు కారకులైన సిబ్బందిపై

ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ని ప్రజావాణిలో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బీడీఎస్ఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు

చౌకి. ప్రసాద్ పాల్గొన్నారు.

Exit mobile version