సెంట్రల్ లైటింగ్ పనులు నిలిపివేత…

*తాత్కాలికంగా సెంట్రల్ లైటింగ్ పనుల నిలిపివేత*

 

ప్రశ్న ఆయుధం న్యూస్ జుక్కల్ సెప్టెంబర్-27

 

పిట్లం మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ పనులలో భాగంగా రోడ్డు కిరువైపులా మట్టిని తవ్వి రోడ్డు పనులు చేస్తుండగా, అర్ధాంతరంగా గురువారం రోజు అంబేద్కర్ చౌరస్తాలో ఒకవైపు జెసిబి పనులను ప్రారంభించగా, స్థానికులు అడ్డుకున్నారు. రోడ్డు ఇరువైపుల మట్టిని తవ్వి గుంతలను చేస్తే ప్రస్తుతం దసరా ఉన్నందున, చాలా ఇబ్బందులు ఏర్పడతాయని పనులను దసరా వరకు ఆపివేసి దసరా అనంతరం చేపట్టాలని ప్రజలు ఆర్ అండ్ బి అధికారులను విన్నవించారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు ఏనుగండ్ల శ్రీనివాస్ రెడ్డి రోడ్ కాంట్రాక్టర్ తో వాగివాదానికి దిగాడంతో, పనులు ఆగిపోయాయి. తిరిగి శుక్రవారం ఆర్ అండ్ బి అధికారులు పనులను ప్రారంభించడానికి వచ్చారు.

ఈరోజు సైతం రోడ్డు పనులను నిలిపి వేసారు. దసరా పండుగ ఉన్న నేపథ్యంలో రోడ్డు ఒక వైపు గుంతను మూసివేసి మరొక వైపు పనిని ప్రారంభించాలని దసరా అనంతరం పనులు చేపట్టాలని కోరడంతో, అధికారులు దసరా తర్వాత పనులను చేపడతామని వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో స్థానిక దుకాణ యజమానులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now