*కర్ణాటక మాజీ డీజీపీ హత్య.. భార్యపై అనుమానం*
*Apr 20, 2025*
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ తన నివాసంలో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు డీజీపీ ఒంటిపై కత్తి పోట్లను గుర్తించారు. ఈ క్రమంలో ఆయన భార్య పల్లవినే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పల్లవిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా ప్రకాశ్‌కు ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో భార్యాభర్తలు తరచూ గొడవ పడుతున్నట్లు సమాాచారం. ఇక ప్రకాశ్ 2017లో పదవీ విరమణ పొందారు.