బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
*పాల్వంచ*: పాల్వంచ మున్సిపాల్టీలో విధులు నిర్వర్తిస్తున్న స్వచ్ఛ భారత్ డ్రైవర్లు,హెల్పర్ లకు మున్సిపాలిటీ ద్వారా జీతాలు ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం పట్టణ అధ్యక్షుడు కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టారు.ఈసందర్భంగా కామేష్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో స్వచ్ఛ భారత్ డ్రైవర్లు,హెల్పర్ లుగా నాలుగున్నర ఏళ్ళుగా విధులు నిర్వర్తిస్తూ జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని,ఏనాయకుడైనా ఎన్నికల ముందు గెలిపిస్తే జీతాలు ఇప్పిస్తామని హామీ ఇవ్వడం గెలిచాక ముఖం చాటేయడం పరిపాటిగా మారిందని విమర్శించారు.కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనులు చేయడం మూలంగా మున్సిపాలిటీకి అవార్డులు వచ్చిన సంగతి మరువొద్దన్నారు.గతంలో మున్సిపల్ కమీషనర్ శ్రీకాంత్ విధులు నిర్వహించిన సమయంలో కార్మికులకు ఇచ్చిన గుర్తింపు కార్డులను అతను బదిలీపై వెళ్ళగానే అట్టి గుర్తింపు కార్డులను సైతం ప్రస్తుత మున్సిపల్ అధికారులు తీసుకొని కార్మికులకు ఇవ్వకుండా వారి వద్ద పెట్టుకున్నారని ఇది సరైంది కాదని కార్మికుల గుర్తింపు కార్డులు కార్మికులకు ఇవ్వాలన్నారు.జిల్లా అధికారులు,స్థానిక ఎంఎల్ఏ వెంటనే స్పందించి స్వచ్ఛ భారత్ డ్రైవర్లు,హెల్పర్ లకు జీతాలు ఇవ్వాలని లేనియెడం దశల వారీగా కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలతో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.ఈదీక్షలకు బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పోనిశెట్టి వెంకటేశ్వర్లు,న్యూడెమోక్రసీ నాయకులు నిమ్మల రాంబాబు,కాంగ్రెస్ నాయకులు గద్దెల రమేష్ ఎస్.కె.భాషా,కాపు సంఘం నాయకులు చిన్నంశెట్టి రంగారావులుసంఘీభావం తెలిపారు.ఈకార్యక్రమంలో కాకటీ హుస్సేన్, దద్ధాల కార్తీక్,రాయల పార్వతి,వేముల రమణ,గూగులోత్ సరోజ,కాంపెళ్లి రాము తదితరులు పాల్గొన్నారు