స్వామి వివేకానంద అందరికీ ఆదర్శప్రాయుడు : ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి
గజ్వేల్, 12 జనవరి 2025 : స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఆదివారం యువజన సంఘాలు, స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చెర్మన్ జకీయుద్ధిన్, మరియు యువజన ప్రతినిధులతో కలిసి స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి వారు మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచమంతా చాటిన మహనీయుడు స్వామి వివేకానంద అని ఈ పర్వదినాన్ని భారతీయులు ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారని సమాజంలో అత్యంత ప్రభావాన్ని కలిగించిన ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త వివేకానందుడు. ఆయన బోధనలు ఎప్పుడూ యువతకు స్పూర్తిదాయకమని అన్నారు. వివిధ రంగాలలో ప్రతిభ చూపి ముందుకు సాగుతున్న యువ ప్రతినిధులను ఘనంగా సత్కరించారు జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా ఉపన్యాస మరియు వ్యాసరచన పోటీలలో గెలుపొందిన వారలకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ యువజన అవార్డు గ్రహీత దేశబోయిని నర్సింలు, కౌన్సిలర్ గోపాల్ రెడ్డి, డాక్టర్ నరేష్ బాబు, వివిధ సంఘాల నాయకులు వివిధ పార్టీల నాయకులు యువజన ప్రతినిధులు బాలకృష్ణ, శ్రీధర్ గౌడ్, నర్సింలు, సురేష్, నాగరాజు గౌడ్ మనోహర్, శ్రీనివాస్, ప్రశాంత్, నరేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.