మండలంలో స్వామి వివేకానంద జయంతి

ప్రశ్న ఆయుధం న్యూస్ జనవరి 12 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

శివంపేట మండలం పిల్లుట్లలో ఆదివారం స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు పెద్దపులి రవి, మండల ప్రధాన కార్యదర్శి గుల్లయ్య గారి సుదర్శన్ ఆధ్వర్యంలో నాయకులు వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వివేకానంద చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని పిలుపునిచ్చారు.అలాగే శివంపేట మండలంలోని దొంతి గ్రామంలో స్వామి వివేకానంద జయంతి కార్యక్రమం నిర్వహించి. ఈకార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. ఆయన మాట్లాడుతూ.. భారతదేశ ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన చైతన్య మూర్తి స్వామి వివేకానంద అన్నారు. మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now