స్వప్నలోక్ కాలనీ నూతన కార్యవర్గం ఎన్నిక

స్వప్నలోక్ కాలనీ నూతన కార్యవర్గం ఎన్నిక

ప్రశ్న ఆయుధం న్యూస్, డిసెంబర్ 31, కామారెడ్డి :

కామారెడ్డి పట్టణం దేవునిపల్లిలోని స్వప్నలోక్ కాలనీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎస్పీఆర్ యాజమాన్యం కొమిరెడ్డి మారుతి, ఎన్నికల అధికారి మెంగవరం పవన్ కుమార్, స్వప్నలోక్ కాలనీ సభ్యుల ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా కమ్మరి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి డి సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా ఆకుల రామా శంకర్, కార్యదర్శిగా బండారి సంజీవరెడ్డి, కోశాధికారిగా సంగెం సతీష్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా నరేష్, సత్యం రెడ్డి, సాయిలు, విష్ణువర్ధన్, నవీన్ లు ఎన్నికయ్యారు. అదేవిధంగా స్వప్నలోక్ కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ కమిటీని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మెంగవరం పవన్ కుమార్ శర్మ, ప్రధాన కార్యదర్శిగా మచ్చ నాగరాజు, ఉపాధ్యక్షులుగా ముఖద్దం స్వామి, కోశాధికారిగా ప్రశాంత్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు కాలనీ యొక్క అభివృద్ధికి ఎల్లవేళలా పాటుపడతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now