*వేదమంత్రోచనంతో అంగరంగ వైభవంగా స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం*
* ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించిన ఆలయ కమిటీ సభ్యులు*
*ఇల్లందకుంట మార్చి 11 ప్రశ్న ఆయుధం*
భద్రాదిగా పేరుగాంచిన ఇల్లందకుంట మండలంలోని చిన్న కోమటిపల్లి గ్రామ శివారులో కొలువుతీరిన స్వయంభు లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ నవీన్ శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రోచనాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఉమ్మడి జమ్మికుంట మండలానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కొలువుదీరిన స్వయంభు లక్ష్మీ నరసింహ స్వామి ఆదరణకు నోచుకోక ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న స్వయంభు లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని చిన్నకోమటిపల్లి గ్రామ ప్రజల సహకారంతో దినదినం అభివృద్ధి చెందుతూ అతికొద్ది కాలంలోనే అనేక ఏర్పాట్లు చేయబడుతూ ముందుకు సాగుతుంది ప్రతి సంవత్సరం నిర్వహించే స్వయంభు లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా లక్ష్మీనరసింహస్వామిని పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి హనుమాన్ దేవాలయంలో ఎదుర్కోళ్లను నిర్వహించి గ్రామంలోని పురవీధులలో కోలాట నృత్యాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించి ప్రధాన ఆలయమైనటువంటి గుట్ట వద్దకు తీసుకువచ్చి ఆలయ పూజారులు ప్రదీప్ శర్మ ఇల్లందకుంట పూజారులు నవీన్ శర్మ ఆధ్వర్యంలో లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ ఘట్టాన్ని వేదమంత్రోచ్ఛరణల మధ్య వినసొంపైన కంఠంతో కనుల పండుగ వందలాది మంది భక్తులు వీక్షిస్తుండగా నిర్వహించారు మొదట ఆలయ చైర్మన్ చిట్ల చంద్రమౌళి దంపతులు, చుక్క అరుణరాణి-రంజిత్ కుమార్, చుక్క రజిత-వేణుగోపాల్, స్వామివారికి కల్యాణ పట్టువస్తారని సమర్పించారు వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి కృపకు పొందారు లక్ష్మీనరసింహస్వామి నామస్మరణతో ఇల్లందకుంట మండలంలోని చిన్నకొమటిపల్లి గ్రామం మారుమ్రోగింది. అనంతరం ఆలయంలో అన్న ప్రసాద వితరణ చేపట్టారు .ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చెట్ల చంద్రమౌళి, వైస్ చైర్మన్ ముడెడ్ల రమేష్ ,కోశాధికారి చుక్క వెంకటేశ్వర్లు మహా అన్న ప్రసాద వితరణ చుక్క అరుణరాణి రంజిత్ కుమార్, కళ్యాణ మండపం టెంట్ హౌస్ సామాగ్రి దాత చుక్క రజిత వేణుగోపాల్, ఆలయ ఆర్చ్ అలంకరణ దాత జవ్వాజి వాణి వేణు, డైరెక్టర్లు చిట్ల శ్రీనివాస్, మూడెడ్ల రమేష్, మూడేళ్ల శ్రీనివాస్, నెల్లి శేషు ,బుర్ర రఘు, కొత్తపల్లి శంకర్ ,గూడెపు రమేష్ ,మారేపల్లి రాజయ్య, తోపాటు గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు.