లింగంపేట్‌లో సర్పంచ్, ఉప సర్పంచ్ ప్రమాణస్వీకారం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధం) డిసెంబర్ 22
కామారెడ్డి జిల్లా లింగంపేట్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ పాలకవర్గం శుక్రవారం అధికారికంగా ప్రమాణస్వీకారం చేసింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచిగా కౌడ రవి ప్రమాణస్వీకారం చేయగా, ఉప సర్పంచిగా పోతగోని ప్రసాద్ గౌడ్ ప్రమాణస్వీకారం చేశారు. అలాగే గ్రామ పంచాయతీకి ఎన్నికైన ఇతర వార్డు సభ్యులు కూడా ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కౌడ రవి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, పారిశుధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. గ్రామ ప్రజల సహకారంతో లింగంపేట్ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.