Site icon PRASHNA AYUDHAM

మంత్రి చేతుల మీదగా అవార్డు అందుకున్న స్విమ్మర్ అబ్దుర్ రెహమాన్

IMG 20250815 151952

Oplus_131072

సంగారెడ్డి, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): యువ స్విమ్మర్ ముహమ్మద్ అబ్దుర్ రెహమాన్ సిద్ధిఖ్ స్విమ్మింగ్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు సంగారెడ్డి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలాజగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య , జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. కృషి, పట్టుదల, స్విమ్మింగ్ పట్ల అంకితభావాన్ని ప్రశంసిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ, జాతీయ స్థాయిలో జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు. ఈ సందర్భంగా డీవైఎస్ఓ ఖాసిం బేగ్, స్విమ్మింగ్ కోచ్ శేషు కుమార్, అసిస్టెంట్ కోచ్ శివ, డీఎస్ఏ సిబ్బంది అభినవ్, దీపిక, పవన్ కుమార్, స్విమ్మింగ్ పూల్ సిబ్బంది పవన్ చౌహాన్, కృష్ణ తదితరులు అభినందించారు.

Exit mobile version