బోడుప్పల్‌లో నూతన దేవాలయ కమిటీ ప్రమాణ స్వీకారం

బోడుప్పల్‌లో నూతన దేవాలయ కమిటీ ప్రమాణ స్వీకారం

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ ప్రశ్న ఆయుధం ఆగస్టు 21

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బంగారు మైసమ్మ, శ్రీ నల్ల పోచమ్మ, శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయాల నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్‌గా బొబ్బల లక్ష్మారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు కమిటీ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమానికి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ తోటకూర వజ్రేశ్ యాదవ్, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు పోగుల నర్సింహా రెడ్డి, మాజీ మేయర్ తోటకూర అజయ యాదవ్, మాజీ కార్పొరేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు మరియు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment