Site icon PRASHNA AYUDHAM

కామారెడ్డిలో తాడ్వాయి ఎంపీడీవోకి ఉత్తమాధికారిగా గౌరవం

IMG 20250815 WA0509

కామారెడ్డిలో తాడ్వాయి ఎంపీడీవోకి ఉత్తమాధికారిగా గౌరవం

 

కామారెడ్డి జిల్లా తాడ్వాయి

(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 15

 

 

జిల్లా స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తాడ్వాయి మండల ఎంపీడీవో సయ్యద్‌ సాజిద్‌ అలీ,కి ఉత్తమ ఎంపీడీవో అవార్డు, లభించింది. కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో గురువారం జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆశిష్‌ సాంగ్వాన్, తెలంగాణ వ్యవసాయ & రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు.

 

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చందర్ నాయక్, జిల్లా ప్రజాపరిషత్ సీఈఓ, విభాగాధిపతులు, అధికారులు పాల్గొన్నారు. తమ కర్తవ్యనిర్వహణలో అంకితభావం, అభివృద్ధి కార్యక్రమాల సమర్థవంతమైన అమలు, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆయనను ఈ గౌరవానికి ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు.

Exit mobile version