తాడ్వాయి మండలం – దేవాయిపల్లి గ్రామ పంచాయతీ
ముత్యాల నరేష్ కుమార్ నాలుగు ప్రధాన హామీలు ప్రకటింపు
గ్రామాభివృద్ధే లక్ష్యంగా సంకల్పం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం డిసెంబర్ 4
తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ముత్యాల నరేష్ కుమార్ గ్రామ ప్రజలకు నాలుగు కీలక అభివృద్ధి హామీలను ప్రకటించారు. ముందుగా గ్రామంలో మంచినీటి శుద్ధీకరణ ప్లాంట్ పూర్తయ్యే వరకు ప్రమాణస్వీకారం చేయబోనని స్పష్టం చేశారు. బీసీ సాకలి గల్లీలో మురికి కాలువ నిర్మాణం, సీసీ రోడ్డు పనులు త్వరితగతిన చేపడతానని హామీ ఇచ్చారు. గ్రామంలోని 8 వార్డులకు 150 అడుగుల చొప్పున బోర్లు వేయించి తాగునీటి సమస్యను తీర్చడమే లక్ష్యమని తెలిపారు. అదనంగా, దేవాయిపల్లి నుండి రైతు వేదిక వరకు వీధిదీపాల ఏర్పాటు చేసి భద్రతతో కూడిన రవాణా సౌకర్యం కల్పిస్తానని నరేష్ కుమార్ పేర్కొన్నారు.గ్రామ ప్రజల అభ్యున్నతి, మౌలిక వసతుల అభివృద్ధే తన ప్రాధాన్యమని అభ్యర్థి అన్నారు.