భూ భారతి సర్వే, డబుల్ బెడ్ రూమ్ ల వివరాలు వెల్లడించిన తహీసిల్దార్

భూ భారతి సర్వే, డబుల్ బెడ్ రూమ్ ల వివరాలు వెల్లడించిన తహీసిల్దార్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి(ప్రశ్న ఆయుధం) జులై 30.

కామారెడ్డి జిల్లా రాజంపేట మండల తహీసిల్దార్, కె. జానకి మండల కేంద్రంలో జరిగిన భూభారతి సర్వే దరఖాస్తులు 1654 వచ్చాయని, అందులో ఇప్పటివరకు 250 దరఖాస్తుల సర్వే పూర్తి చేయడం జరిగిందని, మిగతా దరఖాస్తులు ఇప్పటికైనా ఎవరైనా ఉంటే ఇవ్వవచ్చని వెల్లడించారు. వారంలో మూడు రోజులు బిక్నూర్ మండలంలో మిగతా మూడు రోజులు రాజంపేట మండలంలో సర్వేయర్ ద్వారా సర్వే జరిపించడం జరుగుతుందని తెలిపారు. మండల కేంద్రంలో డబుల్ బెడ్రూం లు

50 ఇల్లు పూర్తి కావడం జరిగిందని, గతంలో లబ్ధిదారులు ఎంపికలో గ్రామ పంచాయతీ కార్యదర్శి. నీరడి అశోక్ కుమార్. నిర్వహించారని , ఇందులో లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా జరగలేదని, ఆర్డీవో మరియు స్థానిక ఎమ్మెల్యే రమణారెడ్డి మళ్లీ విచారణ జరిపి లబ్ధిదారుల ఎంపికలను సరి చేయవలసిందిగా ఆదేశించారని ఎమ్మార్వో కె. జానకి తెలపడం జరిగింది.

Join WhatsApp

Join Now